చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా..? అయితే ఈ ప్రమాదంలో పడ్డట్లే..!

చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా..? అయితే ఈ ప్రమాదంలో పడ్డట్లే..!

ప్రస్తుత డిజిటల్ యుగంలో, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లు, టాబ్లెట్‌‌‌‌‌‌‌‌లు, టీవీలు పిల్లల రోజువారీ జీవితంలో అనివార్యంగా మారాయి. అయితే, ఈ పరికరాల అధిక వినియోగం పిల్లల ఆరోగ్యం, అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది.

స్క్రీన్ సమయం – మెదడు అభివృద్ధి

తాజా అధ్యయనాలు అధిక స్క్రీన్ సమయం పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి. ఉదాహరణకు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, టీవీలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరమని, ఇది 'వర్చువల్ ఆటిజం' ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి

స్క్రీన్ సమయం – మానసిక ఆరోగ్యం  

2018లో నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) నిర్వహించిన అధ్యయనం ప్రకారం రోజుకు 7 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లల్లో మెదడు కార్టెక్స్ (cortex) మందగించడం కనిపించింది. ఇది ఆలోచన, నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకత వంటి నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా, ఇది మానసిక ఒత్తిడి, ఆత్మహత్యా ఆలోచనలు పెరుగుదలకు దారి తీస్తుంది.

 అధిక స్క్రీన్ సమయం, ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం, పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం వంటి మానసిక ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. భారతదేశంలో, 18- నుంచి24 సంవత్సరాల వయస్సు గల వారిలో డిజిటల్ వ్యసనం మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం, అధిక ఆత్మహత్య ధోరణులు మరియు నిద్రలేమి వంటి సమస్యలతో ముడిపడి ఉంది. 

2019లో జామా పీడియాట్రిక్స్ (JAMA Pediatrics) జరిపిన అధ్యయనం ప్రకారం: 2-5 సంవత్సరాల పిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్ కారణంగా తక్కువ మేధస్సు అభివృద్ధి, దృష్టి శక్తి తగ్గుదల కనిపించింది. టీనేజర్లలో ఎక్కువ స్క్రీన్ వినియోగం డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం పెరుగుదలకు దారి తీస్తుంది.  సోషల్ మీడియా ఎక్కువ వాడకం ఆత్మహత్యా ఆలోచనలు పెరుగుదలకు కారణమవుతుంది.

స్క్రీన్ సమయం – నిద్ర సమస్యలు

పడుకునే ముందు స్క్రీన్ వినియోగం మెళటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి, నిద్రలో ఆటంకాలు కలిగిస్తుంది. దీని ఫలితంగా అలసట, ఒత్తిడి, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  2020లో టొరంటో విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం  పడుకునే ముందు స్క్రీన్ వాడకం మెళటోనిన్ (melatonin) స్థాయిలను తగ్గిస్తుంది. ఇది నిద్రలో ఆటంకం, అలసట, ఒత్తిడి పెరుగుదలకు దారి తీస్తుంది. దీర్ఘకాలంలో, ఇది ఆరోగ్య సమస్యలు (ఉదా: హై బీపీ, ఊబకాయం) వచ్చే అవకాశం ఉంటుంది.

పిల్లల్లో స్క్రీన్ వ్యసనం లక్షణాలు

సోషల్ మీడియా లేకుండా అసహనం. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమ్స్ ఆడకపోతే చిరాకు, డిప్రెషన్ స్క్రీన్ లేకుండా ఉండలేకపోవడం చదువుపై దృష్టి తగ్గడం, మార్కులు పడిపోవడం..ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి.

తల్లిదండ్రులకు సూచనలు

1. స్క్రీన్ సమయం పరిమితం చేయండి. 
5 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 1 గంట, టీనేజ్‌‌‌‌‌‌‌‌లో
 2 గంటలకు మించకుండా స్క్రీన్ సమయం నియంత్రించండి.
2. ప్రత్యామ్నాయ కార్యకలాపాలు ప్రోత్సహించండి. బహిరంగ ఆటలు, పుస్తకాలు చదవడం, సృజనాత్మక హాబీలు ప్రోత్సహించండి.
3. నిద్రపూట స్క్రీన్ వినియోగం తగ్గించండి. పడుకునే ముందు కనీసం 1 గంట ముందే 
స్క్రీన్ వినియోగాన్ని ఆపండి.
4. మీరు ఆదర్శంగా ఉండండి. తల్లిదండ్రులు స్వయంగా ఫోన్ వినియోగాన్ని తగ్గించి,
 పిల్లలకు ఆదర్శంగా ఉండండి. పిల్లల స్క్రీన్ వినియోగంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి జాగ్రత్తలు తీసుకోవాలి.  పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడానికి, వారి ఆరోగ్యం, అభివృద్ధి కోసం సమయానుకూల చర్యలు తీసుకోవడం అత్యవసరం.

- కొలను
వెంకటేశ్వర రెడ్డి