
పద్మారావునగర్, వెలుగు: ప్రమాదవశాత్తు ఓ యువకుడి కంటిలో దిగిన స్క్రూడ్రైవర్‌ను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్వైద్యులు ఆపరేషన్చేసి, తొలగించారు. వారి వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన రంజిత్ ఎలక్ట్రికల్ మెకానిక్ గా చేస్తున్నాడు. ఈ నెల 8న రిపేరింగ్పనులు చేస్తుండగా స్క్రూడ్రైవర్ కుడి కంటిలో బలంగా దిగింది.
కుటుంబసభ్యులు అతన్ని బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్కంటి దవాఖానలో అడ్మిట్ చేశారు. వైద్యుల సూచన మేరకు మరుసటిరోజు నిమ్స్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు 10వ తేదీన గాంధీ హాస్పిటల్కు రిఫర్ చేశారు. గాంధీ వైద్యులు టెస్ట్చేసి, కంటికి ఎటువంటి గాయం కాలేదని, పైభాగంలో గుచ్చుకుందని నిర్ధారించారు. న్యూరోసర్జరీ విభాగానికి తరలించి, సుమారు 2 గంటలపాటు శ్రమించి, స్క్రూడైవర్‌ను సక్సెస్ఫుల్గా తొలగించారు. రంజిత్ కోలుకుంటున్నాడని, త్వరలోనే డిశ్చార్జ్చేస్తామని హాస్పిటల్అధికారులు మంగళవారం తెలిపారు.