నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే డిచ్పల్లిలోని సీఎంసీ కాలేజీలో ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ జనరల్ అబ్జర్వర్ ఎలిస్వజ్శుక్రవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి పరిశీలించారు. ప్రతి గదిని విజిట్ చేసి సూచనలు చేశారు. అర్బన్, రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ర్టిబ్యూషన్ సెంటర్ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఇక్కడే జరుగనున్నందున అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాల్స్ వద్ద సీసీ కెమెరాలు, తాగునీరు, కరెంట్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు తప్పనిసరని సూచించారు. కౌంటింగ్ నిర్వహించే సిబ్బంది, పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఏజెంట్ల కోసం ఎంట్రీ, ఎగ్జిట్ వేరువేరుగా ఉండాలన్నారు. సీపీ కల్మేశ్వర్, నగర పాలక కమిషనర్మంద మకరంద్, ట్రైనీ కలెక్టర్ సాకేత్, డీసీపీ శేషాద్రిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, లేబర్ ఆఫీసర్ యోహాన్, మెప్మా పీడీ రాజేందర్ తదితరులు ఉన్నారు.