డిప్యూటీ సీఎం మధిర పర్యటన ఏర్పాట్ల పరిశీలన

మధిర, వెలుగు : మధిర పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు బుధవారం డిప్యూటీ సీఎం, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిరకు రానున్నారు. ఈ సందర్భంగా హెలీపాడ్ స్థలాన్ని మంగళవారం అధికారులు, కాంగ్రెస్​ పార్టీ నాయకులు పరిశీలించారు. నిధానపురం ఆర్​అండ్​డీ రోడ్డు నాలుగు లేన్లకు మధిర ట్యాంక్​ వద్ద, మధిర నుంచి ఆత్కూరు  వరకు బీడీ రోడ్డు వెడల్పు, ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. 

కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ మధు,  టౌన్ ఎస్సై సంధ్య , మున్సిపాలిటీ కమిషనర్ షఫీ ఉల్లా, ఆర్ అండ్ బీ అధికారులు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్,  మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోన ధని కుమార్ తదితరులు పాల్గొన్నారు.