అప్లికేషన్లపై ఈ నెల 28 వరకు పరిశీలన

కామారెడ్డి, వెలుగు: కొత్తగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై వచ్చిన అప్లికేషన్లపై ఈ నెల 28 వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నట్లు కామారెడ్డి కలెక్టర్ జితేశ్​వి పాటిల్​పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్​లో   పొలిటికల్ లీడర్లు, ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు. 

కలెక్టర్​ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు లేని జాబితాను రూపొందించడంలో పొలిటికల్ పార్టీల పాత్ర కీలకమన్నారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్​ స్థాయిలో ఏజెంట్లను నియమించుకొని, ఎలాంటి తప్పులు లేని లిస్టు రూపొందేలా సహకరించాలని కోరారు.పొరపాట్లు, తప్పిదాలు ఉంటే వెంటనే రిటర్నింగ్​ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలన్నారు.