ఖిలావరంగల్ (కరీమాబాద్), వెలుగు: మామునూర్ నాల్గో బెటాలియన్ లో ఎస్సీటీపీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024 ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కమాండెంట్ రాంప్రకాశ్హాజరై క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం గెలిపొందిన వారికి మెడల్స్, మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ పూజ, అసిస్టెంట్ కమాండెంట్లు కృష్ణ ప్రసాద్, వీరన్న, భిక్షపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్శోభన్, రవి, పురుషోత్తం రెడ్డి, సర్వర్, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, అశోక్, కృష్ణ పాల్గొన్నారు.