తొర్రూరు గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా చర్యలు: మిషన్ భగీరథ శాఖ ఎస్ఈ ఎ.సురేందర్

తొర్రూరు గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా చర్యలు: మిషన్ భగీరథ శాఖ ఎస్ఈ ఎ.సురేందర్

తొర్రూరు, వెలుగు: గ్రామాల్లో చేతిపంపులను మరమ్మతులు చేసి మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ శాఖ ఎస్ఈ ఎ.సురేందర్ అన్నారు. గురువారం తొర్రూరు, పెద్దవంగర మండలాలకు చెందిన గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు గ్రామానికి సహాయకులను నియమించిందని, తొర్రూరులో వారికి 4 రోజులపాటు చేతిపంపుల నిర్వహణ, నల్లాల లీకేజీలు, బోర్లు, బావులలో ఉన్న మోటర్లు, స్టార్టర్లు, వైర్లు, ఫీజులపై శిక్షణ అందించి, వాటి మరమ్మతులపై అవగాహన కల్పించి, ప్రాక్టీస్ చేపిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ శాఖ ఏఈఈ లు పి.వెంకటేశ్వర రెడ్డి, యాకుబ్ పాషా, నిశాంక్, మంచినీటి సహాయకుల జిల్లా శిక్షకుడు ఎండీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.