కన్జూమర్​ రిసెప్షన్​ డెస్క్​లు ఏర్పాటు చేస్తాం : ఎస్ఈ వెంకటరమణ

హనుమకొండ, వెలుగు: వినియోగదారులకు మరింత చేరువై, సమస్యలు పరిష్కరించేందుకు సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ ఆఫీసుల్లో కన్జ్యూమర్ రిసెప్షన్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నామని హనుమకొండ ఎస్ఈ వెంకటరమణ సూచించారు. హనుమకొండలోని జిల్లా స్టోర్ ను శనివారం ఆయన తనిఖీ చేసి, మెటీరియల్ లభ్యత తదితర వివరాల గురించి ఆరా తీశారు. 

ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ పరంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే 941 ఒరిగిన, 109 తుప్పు పట్టిన స్తంభాలు మార్చడంతోపాటు 37 కిలోమీటర్ల మేర లైన్లు సవరించినట్లు పేర్కొన్నారు. అంతరాయాలు లేకుండా విద్యుత్​ సరఫరా అందిస్తున్నందుకు టీజీఎన్​పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అభినందించినట్లు తెలిపారు.