మొక్కజొన్న చేన్లలో పోలీసుల తనిఖీలు

మొక్కజొన్న చేన్లలో పోలీసుల తనిఖీలు

 

  • గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో సెర్చ్ 

లింగంపేట, వెలుగు:  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నేరల్ తండా, చద్మల్ తండా, బీర్మల్ తండా, కొత్తబాది తండా, గుజ్జుల్​తండా, సోమారం తండా, గొల్లాడి తండా శివార్లలోని మొక్కజొన్న పంటలను, ఫారెస్టు  భూములను శుక్రవారం పోలీస్​, ఎక్సైజ్ శాఖలకు చెందిన వంద మంది సిబ్బంది తనిఖీలు చేశారు. గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాకీర్​ఆధ్వర్యంలో ఇరు శాఖల సిబ్బంది మొక్కజొన్న పంటలను క్షుణ్ణంగా పరిశీలించారు. 

ఫారెస్టు భూముల్లో మొక్కజొన్న తోటల్లో కొంతమంది గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిషేధిత గంజాయిను ఎవరు సాగుచేసినా వారిపై క్రిమనల్​ కేసులు నమోదు చేస్తామన్నారు. తనిఖీల్లో ఎల్లారెడ్డి, సదాశివనగర్​ సీఐలు  రవీందర్​నాయక్​, సంతోష్​, ఎస్​ఐలు ఆంజనేయులు,రంజిత్​, ఎక్సైజ్​ సీఐ షాకీర్​, ఎస్​ఐ గంగాధర్​ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.