దిల్ రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. వాహనంలో తీసుకెళ్లిన ఐటీ అధికారులు

దిల్ రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. వాహనంలో తీసుకెళ్లిన ఐటీ అధికారులు

నిర్మాత దిల్ రాజు ఇంట్లో శుక్రవారం (24 జనవరి) ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నాలుగోరోజు సోదాల అనంతరం దిల్ రాజును తమ వాహనంలో తీసుకెళ్లారు. తన ఇంట్లో నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్న నిర్మాణ సంస్థ  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

ఐటీ అధికారుల సోదాల్లో భాగంగా గురువారం దిల్ రాజు సోదరుడు విజయసింహా రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. విజయసింహా రెడ్డి ఆటో మొబైల్ రంగంలో వ్యాపారం చేస్తు్న్నారు. దిల్ రాజు, ఆయన సోదరుడి ఇంట్లో పలు ఆభరణాలు సీజ్ చేశారు. 

ఇప్పటికే  దిల్ రాజు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు దిల్ రాజు నిర్మించిన సినిమాలు, వచ్చిన ఆదాయంపై విచారణ చేస్తున్నారు.