
న్యూఢిల్లీ: స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (ఎస్‌ఎంఈ) ఐపీఓల రూల్స్‌ను సెబీ కఠినం చేసింది. ఐపీఓ సైజ్‌లో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద అమ్మే వాటా 20 శాతానికి మించకూడదు. అంతేకాకుండా ఓఎఫ్‌ఎస్ కింద షేర్‌హోల్డర్ తన వాటాలో 50 శాతానికి మించి అమ్మకూడదు. అలానే చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండు సార్లు కంపెనీ ప్రాఫిట్ (ట్యాక్స్‌లకు ముందు) రూ. కోటి దాటాలి. వీటితో పాటు ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్స్ రూల్స్‌ను కూడా సెబీ కఠినం చేసింది. ఎస్‌ఎంఈ ఐపీఓకి వచ్చే కంపెనీలో ప్రమోటర్లు మెయింటైన్ చేయాల్సిన కనీస వాటా (ఎంపీసీ) లాకిన్ పీరియడ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఏడాది తర్వాత సగం వాటా లాకిన్ పీరియడ్ నుంచి రిలీజ్ అవుతుంది. మిగిలిన సగం రెండేళ్ల తర్వాత అన్‌లాక్ అవుతుంది. మెయిన్ బోర్డు ఐపీఓ మాదిరే ఎస్‌ఎంఈ ఐపీఓలో కూడా నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులు జరుగుతాయి. ఇక నుంచి ఎస్‌ఎంఈ ఐపీఓలో కనీసం రెండు లాట్ల కోసం అప్లయ్ చేసుకోవాలి. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్‌లో జనరల్ కార్పొరేట్ పర్పొజ్ (జీసీపీ) కోసం గరిష్టంగా 15 శాతం లేదా రూ.10 కోట్లనే (ఏది తక్కువైతే అది) కేటాయించాలి. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ లేదా సంబంధిత కంపెనీల అప్పులు తీర్చడానికి ఎస్‌ఎంఈ ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌ను వాడకూడదు. అలానే ఎస్‌ఎంఈ ఐపీఓల డీఆర్‌హెచ్‌పీ పేపర్లను 21 రోజుల్లో పబ్లిక్ ముందుకు తేవాలి. న్యూస్ పేపర్లలో ప్రకటించాలి.