నెలలోపు ఎన్ఎఫ్​ఓ తేవాలి..ఎంఎఫ్​ కంపెనీలకు సెబీ ఆదేశం

నెలలోపు ఎన్ఎఫ్​ఓ తేవాలి..ఎంఎఫ్​ కంపెనీలకు సెబీ ఆదేశం

న్యూఢిల్లీ:మ్యూచువల్ ​ఫండ్​ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి తీసుకొని యూనిట్లు ఇచ్చిన నెల రోజుల్లోపు కచ్చితంగా న్యూ ఫండ్​ ఆఫర్​​(ఎన్​ఎఫ్​ఓ)  ను ప్రారంబించాలని మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్​ఎఫ్​ఓ ఫండ్​ ప్రారంభానికి తుది గడువు అంటూ ఏదీ లేదు. ఈ కొత్త విధానం ఏప్రిల్​ నుంచి అమల్లోకి వస్తుంది. 

ఎంఎఫ్​లు అవసరమైనంత డబ్బును మాత్రమే సేకరించేలా చూడటానికి, నిధుల దుర్వినియోగం ఆపడానికే ఈ ప్రయత్నమని సెబీ తెలిపింది. నిధులను ఎప్పటి నుంచి ఇన్వెస్ట్​ చేస్తారో స్కీమ్ ​ఇన్ఫర్మేషన్​ డాక్యుమెంట్​(ఎస్​ఐడీ)లోనే తెలియజేయాలని అసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీలను సెబీ ఆదేశించింది.