అనీల్ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం : రూ.25 కోట్ల ఫైన్

అనీల్ అంబానీపై  సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది. ఈ నిషేధం ఐదేళ్ల వరకు అమల్లో ఉంటుందని సెబీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2024, ఆగస్ట్ 23వ తేదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 

అనీల్ అంబానీపై నిషేధానికి కారణం లేకపోలేదు. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీలకు తరలించటంతో ఈ నిషేధం విధించింది సెబీ. ఈ ఐదేళ్లు సెక్యూరిటీ మార్కెట్ కు దూరంగా ఉండాలని.. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉన్న.. అనుబంధం ఉన్న కంపెనీలతోనూ లావాదేవీలు చేయకూడదని ఆంక్షలు విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ కు చెందిన మాజీ అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నది సెబీ. వీరు ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా కీ మేనేజ్ మెంట్ పర్సనల్ (KMP) లేదా మార్కెట్ రెగ్యులేటర్ దగ్గర నమోదైన మధ్యవర్తి పొజిషన్ లోనూ నియామకానికి, లావాదేవీలకు అర్హులు కాదని స్పష్టం చేసింది సెబీ. సెక్యూరిటీ మార్కెట్ తో రాబోయే ఐదేళ్లు ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడని.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:-ఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్తత.. స్పీకర్ పోడియం ఎక్కిన ఎమ్మెల్యేలు

సెమీ నిర్ణయంతో అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. 25 పైసలు నష్టపోయి 4 రూపాయల 45 పైసలు దగ్గర ట్రేడ్ అవుతుంది. 

అనీల్ అంబానీతోపాటు మరో 24 కంపెనీలను కూడా సెక్యూరిటీస్ మార్కెట్ లో పాల్గొనకుండా ఐదేళ్లు నిషేధం విధించింది సెమీ.