
న్యూఢిల్లీ: ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ (షేర్లు, బాండ్లు వంటివి) లో రూ.50 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసిన ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇక నుంచి అదనపు వివరాలను(డిస్‌క్లోజర్స్) బయటపెట్టాల్సిన అవసరం లేదు. గతంలో రూ.25 వేల కోట్ల కంటే ఎక్కువ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) ఉంటే అదనపు డిస్‌కోజర్స్ తప్పనిసరి. తాజాగా జరిగిన సెబీ బోర్డు మీటింగ్‌లోఈ ఏయూఎం లిమిట్‌ను డబుల్ చేయాలని నిర్ణయించారు. కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే నేతృత్వంలో మొదటి బోర్డు మీటింగ్‌ను సెబీ సోమవారం నిర్వహించింది.
కానీ, ఎఫ్‌పీఐల ఈక్విటీ ఏయూఎంలో కనీసం 50 శాతం ఒకే కంపెనీకి చెందితే అదనపు డిస్‌క్లోజర్స్ తప్పనిసరి. ఎఫ్‌పీఐలు ఏప్రిల్ 1 నుంచి 12.5 శాతం లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలని ప్రభుత్వం నిర్దారించింది. గతంలో 10 శాతం చెల్లిస్తే సరిపోయేది. దీనిపై ఎఫ్‌పీఐలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెబీ మెంబర్లు పదవిలో ఉంటూనే కంపెనీల నుంచి ప్రయోజనాలు పొందితే (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఉంటే ఫాలో అవ్వాల్సిన ప్రొవిజన్లను రివ్యూ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సెబీ నిర్ణయించింది.