ముంబై: సెబీ చైర్ పర్సన్ మాధవిపూరీ బచ్ రాజీనామా చేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబైలోని సెబీ హెడ్ ఆఫీస్ ముందు దాదాపు 200 మంది ఉద్యో గులు గురువారం (సెప్టెంబర్ 5,2024) నిరసన తెలిపారు.
ఉన్నతాధికారులు సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ..చైర్ పర్సన్ మాధవి పూరీ బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ వెల్లడించిన రిపోర్టులో సెబీ చైర్ పర్సన్ మదాభి పూరీ బచ్ అవినీతికి ఆరోపణలు వచ్చిన క్రమంలో..సెబీ ఉద్యోగుల నిరసనలు ప్రాధాన్యత సంతరించుకుంది. హిండెన్ బర్గ్ నివేదికలో సెబీ చైర్ పర్సన్ మాధవి పూరీ బచ్ , ఆమె భర్త ఆఫ్ షేర్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
సెబీ ఉద్యోగులు నిరసన కారణం..
గత నెలలో కొంతమంది సెబీ ఉద్యోగులు కొంతమంది ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సెబీలో పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం.. ప్రస్తుతం సెబీలో ప్రెజర్ తో కూడి కలుషిత వాతావరణం నెలకొంది..చర్యలు తీసుకోవాలని కోరారు.
సెబీ స్పందిస్తూ.. బయటి అంశాలపై ఉద్యోగుల దృష్టి ఉంది..పనితీరు, జవాబుదారీతనం ఉన్నత ప్రమాణాలను ఉద్యోగులు పాటించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అయితే రెగ్యులేటర్ పేర్కొన్న అంశాలపై ఎలాంటి వివరణ లేదు.