న్యూఢిల్లీ: డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్, కాస గ్రాండ్ ప్రీమియర్ బిల్డర్స్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్–ఎక్సెల్ ఈపీసీ ఇండియా కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నాలుగు కంపెనీలూ గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో ప్రిలిమినరీ పేపర్లను సెబీకి అందజేయగా, డిసెంబరులో అబ్జర్వేషన్ లెటర్లు వచ్చాయి.
ఈ లెటర్లు వచ్చాయంటే ఐపీఓకు అనుమతి దొరికినట్టే! టెమాసెక్, టీపీజీ పెట్టుబడులు ఉన్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీఓలో రూ.300 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూ, 6.95 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్ ఉంటుంది. చెన్నయ్‌కు చెందిన రియల్టీ డెవలపర్ కాసగ్రాండ్ ప్రీమియర్ ఐపీఓలో రూ.వెయ్యి కోట్ల ప్రెష్ ఇష్యూ, రూ.100 కోట్ల విలువైన ఓఎఫ్ఎస్ ఉంటాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన టోల్కలెక్షన్, ఈపీసీ ఇన్ఫ్రా కంపెనీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓలో రూ.105 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, 31 లక్షల కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్ ఉంటాయి. ఇథనాల్ ప్లాంట్ల తయారీదారు రీగ్రీన్ ఎక్సెల్ఈపీసీ ఐపీఓలో రూ.350 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, 1.14 కోట్ల ఈక్విటీ షేర్లు గల ఓఎఫ్ఎస్ఉంటాయి.