సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 97 ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఫేజ్-1, ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలుంటాయి.
పోస్టులు: మొత్తం 97 ఖాళీల్లో అసిస్టెంట్ మేనేజర్ -జనరల్- విభాగంలో 62, లీగల్ - 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-24, ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)- 2, రీసెర్చ్- 2, అఫీషియల్ లాంగ్వేజ్-2 పోస్టులు ఉన్నాయి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఫేజ్-1, ఫేజ్-2లో ఆన్‌లైన్ పరీక్షలు, ఫేజ్-3లో ఇంటర్వ్యూ ఉంటాయి. ఫేజ్-1లోని ఆన్‌లైన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీంట్లో అర్హత సాధించినవారిని ఫేజ్-2కు ఎంపిక చేస్తారు. దీంట్లోనూ రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో పాసైనవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. పూర్తి సమాచారం కోసం www.sebi.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.