స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పై అప్రమత్తంగా ఉండండి: సెబీ మెంబర్ అలర్ట్

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పై అప్రమత్తంగా ఉండండి: సెబీ మెంబర్ అలర్ట్

కూర్చున్నటోటు నుంచే కుభేరులు కావచ్చు. కాలు కడపకుండా కోట్లు సంపాదించోచ్చు అంటే మీరు నమ్ముతారా? అవును ఇది స్టాక్ మార్కెట్ లో ట్రేండింగ్ చేయడం ద్వారా సాధ్యమౌతుంది. కొంచెం అవగాహన, ఎక్స్ పీరియన్స్ ఉంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాధించవచ్చు. ఇటీవల కాలంలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు కూడా. ఇందుకు నిదర్శనం 2023 డిసెంబర్ నాటికి 13.9 కోట్ల డిమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. ఇవి కేవలం 9 నెలల్లోనే 20 శాతం పెరిగాయి. చాలామంది ఆన్ లైన్ లో ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెబీ పర్మినెంట్ మెంబర్ కమలేష్ చంద్ర  వర్ష్నే అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ANMI) 13వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో  స్టాక్ మర్కెట్ ట్రేడింగ్ గురించి ప్రస్థావించారు.

 ట్రేడింగ్  చేసే బ్రోకర్స్ అలర్ట్ గా ఉండాలని సూచించారు. ట్రేడ్ చేసేవాళ్ల నమ్మకం గురించి ఆయన చెప్పారు. ఇన్వెస్టర్స్ నమ్మకం కోల్పోతే ఫైయిల్ అవుతారని అన్నారు. స్టాక్ మార్కెట్లో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయని, వాటన్నింటిలో సెబీ కలుగజేసుకోలేదని కమలేష్ చంద్ర అన్నారు. కొంతమంది బ్రోకర్స్ అవకతవకలు చేస్తున్నారని వారిపై బ్రోకర్స్ కమ్మూనిటీలు ఓ కన్ను వేయాలని కోరారు.  మ్యానిప్లేషన్ అరికట్టడానికి వాచ్ డాగ్ ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీతో నిరంతరం ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సెబీ శాశ్వత సభ్యుడు  కమలేష్ చంద్ర  వర్ష్నే తెలిపారు. సెబీ రిసెర్చ్ కోసం అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తుందని ఆయన అన్నారు. మ్యానిప్లేషన్ పై నిఘా పెట్టాలని స్టాక్ మార్కెటింగ్ సంస్థలను అప్రమత్తం చేశారు.

 స్టాక్ మార్కెట్‌లో అవకతవకల ఉదంతాల నేపథ్యంలో చట్టానికి కట్టుబడి ఉండటం ద్వారా ప్రయోజనాలు ఉంటాయని, నిబంధనలు అతిక్రమించవద్దని కమలేశ్ సలహా ఇచ్చారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలి, మార్కెట్ పారదర్శకంగా ఉండటానికి, సెబీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తప్పులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కమలేష్ తెలిపారు.