
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్, డిపాజిటరీ పార్టిసిపెంట్ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై సెబీ రూ.7 లక్షల పెనాల్టీ వేసింది.45 రోజుల్లో ఈ పెనాల్టీ చెల్లిం చాల్సి ఉంటుంది. కంపెనీపై ఏప్రిల్ 2021 నుంచి జూన్, 2022 మధ్య స్టాక్ ఎక్స్చేంజ్‌లు, డిపాజిటరీలతో కలిసి సెబీ దర్యాప్తు జరిపింది.
26 ఫిర్యాదులను 30 రోజుల గడువులో మోతీలాల్ ఓస్వాల్ పరిష్కరించలేదని గుర్తించింది. మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ (ఎంటీఎఫ్) కొలేటరల్స్ డేటాను తప్పుగా ఎక్స్చేంజ్‌లకు రిపోర్ట్ చేసిందని కనుగొంది.
రూల్స్ ఉల్లంఘించినందుకు బ్రోకరేజ్ కంపెనీ ఆనంద్ రాతి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌పై కూడా సెబీ రూ.5 లక్షల పెనాల్టీ వేసింది. 45 రోజుల్లో ఈ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2020– అక్టోబర్ 30, 2021 మధ్య కంపెనీని సెబీ తనిఖీ చేసింది. క్లెయింట్ల ఫండ్స్‌ను తప్పుగా వాడిందని గుర్తించింది.