1600 సిరీస్ నెంబర్లు వాడండి: సెబీ సూచన

1600 సిరీస్ నెంబర్లు వాడండి: సెబీ సూచన

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు లావాదేవీల గురించి, సర్వీసుల గురించి వివరించడానికి 1600 సిరీస్​ ఫోన్​నంబర్లనే వాడాలని మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ రిజిస్టర్డ్, రెగ్యులేటెడ్ ​సంస్థలకు స్పష్టం చేసింది. ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెంబర్ వాడటం వల్ల ఇన్వెస్టర్లకు భద్రత ఉంటుందని, మోసాలు తగ్గుతాయని పేర్కొంది. 

ఏవైనా నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్​, మెసేజ్​లు వస్తే రిపోర్ట్​ చేయాలని ఇన్వెస్టర్లకు సూచించింది. సంబంధిత టెలికం ఆపరేటర్ ​డూ నాట్​డిస్టర్బ్​ కంప్లెయింట్​ విధానం ద్వారా లేదా క్రైమ్ ​హెల్ప్​లైన్​ నంబరు 1930కి ఫిర్యాదు చేయవచ్చని సెబీ సూచించింది.