క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ పర్సనల్ ఫైనాన్స్లోని సంక్లిష్ట ఆర్థికాంశాలను సరళతరం చేయడమే లక్ష్యంగా సమగ్ర సాధనాలతో మదుపరుల కోసం సాథీ 2.0 మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునికీకరించిన సాథీ యాప్ ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని సెబీ పేర్కొంది.
ఈ యాప్లో ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్, మాడ్యుల్స్ ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్ల క్రయవిక్రయాలు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ లావాదేవీలతోపాటు కేవైసీ నిబంధనల వివరణ వంటివన్నింటినీ పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మదుపరుల సమస్యలను పరిష్కరించడానికి ఆన్లైన్ డిస్పూట్ రిజల్యూషన్(ఓడీఆర్) వ్యవస్థ వేదికగా ఉంది. ఇన్వెస్టర్ల పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ కోసం అవగాహనను పెంచే వీడియోలు కూడా ఉంటాయి.