సెబీ కొత్త రూల్స్‌‌తో పెరగనున్న ఏంజెల్‌‌ ఫండ్స్‌‌

సెబీ కొత్త రూల్స్‌‌తో పెరగనున్న ఏంజెల్‌‌ ఫండ్స్‌‌

న్యూఢిల్లీ: క్వాలిఫైడ్ ఇన్‌‌స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) డెఫినిషన్‌‌ను సవరించాలని సెబీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఏంజెల్‌‌ ఫండ్స్‌‌లో 200 ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ మంది ఉండకూడదనే లిమిట్‌‌ను తీసేయనుంది. దీంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు  ఏంజెల్ ఫండ్స్‌‌ను ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. 

ఇవి ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌‌లలో  ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు ఎంత మేర రిస్క్ తీసుకోగలరు? వీరు ఆర్థికంగా స్ట్రాంగ్‌‌గా ఉన్నారా? కంపెనీల చట్టం కింద ప్రైవేట్ ప్లేస్‌‌మెంట్ రెగ్యులేషన్స్‌‌కు విరుద్ధంగా ఉంటుందా? వంటి సమస్యలను పరిష్కరించేందుకు సెబీ కేవలం గుర్తింపు పొందిన ఇన్వెస్టర్ల (అక్రెడిటెడ్‌‌  ఇన్వెస్టర్లు–ఏఐల) నే ఏంజెల్ ఫండ్స్‌‌లో జాయిన్ అయ్యేందుకు అనుమతి ఇవ్వనుంది.