
–న్యూఢిల్లీ: మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్– 100 లిస్టెడ్ కంపెనీలు శనివారం నుంచి మీడియాలో వచ్చే ఏదైనా మార్కెట్ పుకార్లను ధ్రువీకరించాలి లేదా తిరస్కరించాలి. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి టాప్ 250 కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. సెబీ నియమం ప్రకారం, ఈ కంపెనీలు మెయిన్స్ట్రీమ్మీడియాలో వచ్చే వార్తలపై 24 గంటలలోపు వివరణ ఇవ్వాలి. అది సరైందో కాదో తేల్చిచెప్పాలి.
సెబీ తను కొత్తగా ప్రవేశపెట్టిన రూమర్ వెరిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ కొన్ని అంశాలకు మినహాయింపులు ఇచ్చింది. కార్పొరేషన్ చర్యలో వాల్యుయేషన్‌ను ప్రభావితం చేసే సమాచారాన్ని లీక్ చేయడాన్ని ఆపడం దీని ఉద్దేశం. ఈ చొరవ రూమర్ వెరిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. న్యాయమైన మార్కెట్‌ను సాధించడంలో సహాయపడుతుందని, తద్వారా ఇది పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని ఎంఎంజేసీ అసోసియేట్స్ ఫౌండర్మకరంద్ జోషి అన్నారు.
బుక్ బిల్డింగ్ ద్వారా బైబ్యాక్, స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా బైబ్యాక్, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్, ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్, టేకోవర్‌లు, మెటీరియల్ ధరల కదలిక కారణంగా షేర్ల ధరపై ప్రభావం, రిపోర్ట్ అయిన సంఘటన లేదా సమాచారం, నిర్ధారణ వంటి వివిధ కార్పొరేట్ చర్యల సందర్భాల్లో ధరను లెక్కించేటప్పుడు మినహాయింపులు ఉంటాయి. కంపెనీ వ్యాపారానికి సంబంధించిన మార్కెట్ పుకార్లు స్టాక్ ధరలలో గణనీయమైన అస్థిరతను సృష్టిస్తాయి. కంపెనీ నిజమైన విలువను ప్రతిబింబించని లావాదేవీలకు దారి తీస్తుంది. టాప్ మేనేజ్మెంట్, ఆర్డర్ రద్దు, ఫైనాన్షియల్హెల్త్ వంటి వాటిపై పుకార్లు వచ్చినప్పుడు కంపెనీలు వివరణ ఇవ్వాలి.