యూపీఐ ఫ్రాడ్స్ అరికట్టేందుకు సెబీ కొత్త ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌

యూపీఐ ఫ్రాడ్స్ అరికట్టేందుకు సెబీ కొత్త ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా సరియైన బ్రోకరేజ్‌‌‌‌‌‌‌‌, ఇంటర్మిడియేట్ కంపెనీలకే డబ్బులు పంపుతున్నారో? లేదో? చెక్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు కొత్త మెకానిజంను సెబీ తీసుకురానుంది. ఇందులో భాగంగా ఇంటర్మిడియేట్ కంపెనీలు ఒక యునిక్  యూపీఐ ఐడీని క్రియేట్ చేయాలని పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు తాము ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌కు కాకుండా సరియైన కంపెనీలకు డబ్బులు పంపుతున్నామని నిర్ధారించుకుంటారు. యూపీఐ ద్వారా వీటికి పంపే డబ్బుల లిమిట్‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుతం ఉన్న రోజుకి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సెబీ ప్రపోజ్ చేసింది. సెబీ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌పై  ఫిబ్రవరి 21 వరకు  ఫీడ్‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఇవ్వొచ్చు.