న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల డీమాట్ అకౌంట్లలో బోనస్ షేర్లు క్రెడిట్ అవ్వడానికి పట్టే టైమ్‌ను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తగ్గించింది. అంతేకాకుండా ఈ షేర్లను రికార్డ్ డేట్ తర్వాత రెండు వర్కింగ్ డేస్‌లోనే ట్రేడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈ విషయాలకు సంబంధించి సెబీ కొన్ని గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది.
- బోనస్ షేర్లను ఇష్యూ చేయాలని ప్లాన్ చేస్తున్న కంపెనీలు బోర్డ్ ఆమోదం పొందిన తర్వాత ఐదు వర్కింగ్ డేస్‌లో అనుమతులు కోసం స్టాక్ ఎక్స్చేంజ్‌లకు అప్లయ్ చేసుకోవాలి.
- రికార్డ్ డేట్ (టీ డే)ను నిర్ణయించుకున్న తర్వాత ఎక్స్చేంజ్‌లకు తెలియజేయాలి. అంతేకాకుండా రికార్డ్ డేట్ తర్వాత వర్కింగ్ డే (టీ+1 డే) నాడు బోనస్ షేర్లను అలాట్ చేయాలి.
- రికార్డ్ డేట్‌ను, షేర్ల అలాట్ చేసే డేట్‌ను, బోనస్ ఇష్యూలో ఇస్తున్న షేర్ల వివరాలను అంగీకరిస్తు ఎక్స్చేంజ్‌లు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేస్తాయి.
- ఆ తర్వాత డిపాజిటరీ సిస్టమ్‌లో బోనస్ షేర్లను క్రెడిట్ చేయడానికి కంపెనీలు సంబంధిత డాక్యుమెంట్లను డిపాజిటరీలకు సబ్మిట్ చేయాలి.
- బోనస్ షేర్లు అలాట్ అయిన తర్వాత వర్కింగ్ డే (టీ+2 డే) నుంచి ఈ షేర్లను ట్రేడ్ చేసుకోవచ్చు.