5,636 ఫిర్యాదులకు సెబీ పరిష్కారం

న్యూఢిల్లీ: క్యాపిటల్​ మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ తన ఫిర్యాదుల పరిష్కార విధానం ‘స్కోర్స్​’ ద్వారా గత డిసెంబరులో 5,636  ఫిర్యాదులను పరిష్కరించింది. నవంబరు నాటికి ఫిర్యాదుల సంఖ్య 5,826కు చేరగా, మరుసటి నెలలో కొత్తగా 5,193 ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మొత్తం ఫిర్యాదుల సంఖ్య 11,019కి చేరింది. ఒక్కో సమస్య పరిష్కారానికి సగటున ఎనిమిది రోజులు పట్టిందని సెబీ తెలిపింది. 

స్కోర్స్​ విధానంలో ఫిర్యాదులు ఆటోమేటిక్​గా సంబంధిత ఎంటిటీకి వెళ్తాయి. యాక్షన్​ టేకెన్​ రిపోర్ట్(ఏటీఆర్​)ను దాఖలు చేయడానికి 21 రోజుల గడువు ఇస్తారు. ఫిర్యాదుదారుకు పరిష్కారం నచ్చకుంటే 15 రోజుల్లోపు మొదటిస్థాయి రివ్యూకు దరఖాస్తు చేయవచ్చు. ఇదీ వద్దనుకుంటే రెండోస్థాయి రివ్యూ కోరవచ్చు. ఆన్​లైన్​ డిస్ప్యూట్​రిజల్యూషన్​ విధానాన్ని కూడా ఎంచుకోవచ్చు.