డిసెంబర్ 31 నుంచి టాప్ 500 కంపెనీల షేర్లకు టీ+0 సెటిల్మెంట్..

డిసెంబర్ 31 నుంచి టాప్ 500 కంపెనీల షేర్లకు టీ+0 సెటిల్మెంట్..

న్యూఢిల్లీ: మార్కెట్ క్యాప్‌‌ పరంగా టాప్ 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 కంపెనీల షేర్లకు టీ+0 సెటిల్‌‌మెంట్ విధానం ఈ నెల 31 నుంచి అందుబాటులో ఉంటుందని సెబీ ప్రకటించింది. స్టాక్ బ్రోకర్లందరూ ఈ విధానాన్ని అమలు చేయొచ్చు. ప్రస్తుతానికి టీ+0 సెటిల్‌‌మెంట్ విధానం ఆప్షనల్ మాత్రమే. ఈ విధానంలో ఇన్వెస్టర్లు షేర్లు కొన్న రోజే ఆ షేర్లు డీమాట్ అకౌంట్‌‌లో క్రెడిట్ అవుతాయి.

షేర్లు అమ్మేవారికి డబ్బులు అదే రోజు క్రెడిట్ అవుతాయి.  టీ+0, టీ+1 సెటిల్‌‌మెంట్ విధానాలకు వేరు వేరు ఛార్జీలు వేయొచ్చని సెబీ పేర్కొంది. కానీ ఛార్జీలు రెగ్యులేటరీ లిమిట్‌‌లోనే ఉండాలని తెలిపింది. బ్లాక్ డీల్‌‌ విండో సెగ్మెంట్‌‌లో కూడా   టీ+0 సెటిల్‌‌మెంట్ సైకిల్‌‌కు సెబీ అనుమతిచ్చింది.