బ్రైట్​కామ్ ​గ్రూపునకు రూ.34 కోట్ల ఫైన్

బ్రైట్​కామ్ ​గ్రూపునకు రూ.34 కోట్ల ఫైన్

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్​ స్టేట్​మెంట్లను అక్రమంగా మార్చినందుకు హైదరాబాద్​కు చెందిన డిజిటల్​ మార్కెటింగ్​ సర్వీసుల కంపెనీ  బ్రైట్​కామ్​గ్రూపు ప్రమోటర్లతో పాటు మరికొందరికి మార్కెట్ ​రెగ్యులేటర్ ​సెబీ రూ.34 కోట్ల ఫైన్​ వేసింది. బ్రైట్​కామ్​ గ్రూపు లిమిటెడ్​(బీజీఎల్​) ప్రమోటర్లు సురేశ్​ కుమార్​రెడ్డి, కంచర్ల విజయ్కు రూ.15 కోట్ల ఫైన్​ పడింది. వీరిద్దరూ సెక్యూరిటీ మార్కెట్లలో లావాదేవీలు చేయకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. డైరెక్టర్​వంటి ఉన్నతస్థాయి పోస్టులు చేపట్టవద్దని సెబీ ఆదేశించింది. బీజీఎల్కు చెందిన వై.శ్రీనివాస రావుకు రూ.రెండు కోట్లు, యెర్రగొండి రమేశ్​రెడ్డికి రూ.కోటి జరిమానా వేసింది.