కేతన్ పరేఖ్‌పై సెబీ బ్యాన్‌

కేతన్ పరేఖ్‌పై సెబీ బ్యాన్‌

న్యూఢిల్లీ: ఇల్లీగల్‌గా ట్రేడింగ్ చేస్తున్నందుకు గాను కేతన్ పరేఖ్‌తో సహా  ముగ్గురు ఇన్వెస్టర్లను  మార్కెట్ నుంచి సెబీ బ్యాన్ చేసింది. వీరు ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడి  ఇల్లీగల్‌గా రూ.65.77 కోట్లు సంపాదించారని తెలిపింది.  

సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఇంటర్మీడియరీ కంపెనీలతో అసోసియేట్ అవ్వొద్దని కేతన్ పరేఖ్‌, రోహిత్ సల్గావ్‌కర్‌‌, అశోక్ కుమార్​పై రిస్ట్రిక్షన్లు పెట్టింది. మొత్తం 22  సంస్థలు, ఇండివిడ్యువల్స్​కు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీలకు చెందిన వివరాలు  ముందే తెలుసుకొని వీరు ట్రేడింగ్ పాల్పడ్డారని  సెబీ పేర్కొంది.