డీమాట్ అకౌంట్పై కొత్త రూల్స్.. పెరిగినవి,తగ్గినవి ఇవే..

డీమాట్ అకౌంట్పై కొత్త రూల్స్.. పెరిగినవి,తగ్గినవి ఇవే..

బేసిక్ సర్వీసెస్ డిమాట్ అకౌంట్స్ (BSDA) లో ఇన్వెస్ట్ మెంట్ పరిమితిని పెంచింది సెక్యూరిటీ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI). ప్రస్తుతం ఉన్న రూ. 2లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. పెంచిన ఇన్వెస్ట్ మెంట్ లిమిట్ సెప్టెంబర్ 1, 2024 నుంచి అములులోకి రానుంది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇన్వెస్టర్లు వారి బీఎస్ డీఏ అకౌంట్లో సెక్యూరిటీ హోల్డింగ్స్ ను రూ.10 లక్షల వరకు ఉంచుకోవచ్చు. 

2012లో సెబీ చేత తీసుకురాడిన ఈ డిమాట్ అకౌంట్ ను స్మాల్ ఇన్వెస్టర్లకోసం ప్రత్యేకంగా రూపొందించారు. రెగ్యులర్ డిమాట్ అకౌంట్ తో పోల్చినప్పుడు తక్కువ ఛార్జీలతో అందిస్తుంది. 

బీఎస్డీఏకు అర్హత: బీఎస్డీఏకు అర్హత పొందాలనుకుంటే.. మీరు ఒకే ఒక్క డీమ్యాట్ అకౌంట్ ను కలిగి ఉండాలి. జాయింట్ ఖాతాలు BSDA కి అనుమతించబడవు. 

సెక్యూరిటీ విలువ: సెప్టెంబర్ 1, 2024 తర్వాత  BSDA లోని సెక్యూరిటీల విలువు రూ. 10లక్షలకు మించకూడదు. అలా చేస్తే సాధారణ బ్రోకరేజ్ ఛార్జీలు వర్తిస్తాయి. దీంతో పాటు ఖాతా ఇకపై BSDA గా అర్హత పొందలేదు. 

డీమ్యాట్ ఖాతా ఛార్జీలు: రెగ్యులర్ డీమ్యాట్ ఖాతాలు డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP) ఆధారంగా రూ. 300 నుంచి రూ. 800 వరకు వార్షిక నిర్వహణ ఫీజుతో వస్తాయి.

SEBI కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 

  • పోర్టుపోలియో విలువు రూ. 4 లక్షల వరకు దీనికి ఆన్యువల్ ఫీజు లేదు. 
  • పోర్టుపోలియో విలువ రూ.4 లక్షల కంటే ఎక్కువ, రూ. 10లక్షల వరకు రూ. 100 వార్షిక నిర్వహణ ఛార్జీ ఉంటుంది. 
  • రూ. 10 లక్షల కంటే ఎక్కువ పోర్ట్ పోలియో విలువ : ఖాతా సాధారనడీమ్యాట్ ఖాతాగా మారుతుంది. ప్రామాణిక ఛార్జీలు వర్తించబడతాయి. 

BSDA హోల్డర్లు ఎలక్ట్రానిక్ స్టేట్ మెంట్ లను ఉచితంగా పొందవచచు. అయితే ఫిజికల్ స్టేట్ మెంట్ లకు ప్రకటన కు రూ.25 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.