
న్యూఢిల్లీ: పర్సనల్ ఫైనాన్స్‌పై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు సెబీ ‘సారథి 2.0’ మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో క్లిష్టంగా ఉండే ఫైనాన్షియల్ కాన్సెప్ట్‌లకు సింపుల్ భాషలో వివరణ ఉంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సారథి యాప్‌కు ఇది అప్‌డేటెడ్ వెర్షన్. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ఈ యాప్‌ను తీసుకొచ్చామని సెబీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ యాప్‌లో ఫైనాన్షియల్ క్యాలికులేటర్లు, కేవైసీ ప్రొసీజర్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, మార్కెట్‌లో షేర్లను కొనడం, అమ్మడం, ఇన్వెస్టర్ల గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, ఆన్‌లైన్ డిస్‌ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్‌ఫామ్ వంటి అంశాలను వివరించే మాడ్యుల్స్ అందుబాటులో ఉంటాయి. పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్‌లో సాయపడే వీడియోలు కూడా ఉంటాయి.