న్యూఢిల్లీ: సోలార్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి లంచాలు ఇచ్చినట్టు అమెరికాలో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌లకు సమన్లు పంపింది.
సోలార్ ప్రాజెక్టుల కోసం మనదేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు 265 మిలియన్లు (రూ. 2,200 కోట్లు) లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించినట్టు కేసు నమోదయింది. అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫార్మ్ నివాసానికి, అదే నగరంలోని ఆయన మేనల్లుడు సాగర్ బోడక్‌దేవ్ నివాసానికి సమన్లు వచ్చాయి.
సమాధానం ఇవ్వడానికి 21 రోజుల గడువు ఉంటుంది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ద్వారా నవంబర్ 21న నోటీసులు వెళ్లాయి. నోటీసులకు స్పందించడంలో విఫలమైతే తీర్పు వ్యతిరేకంగా ఉండొచ్చని కమిషన్ హెచ్చరించింది. కోర్టులో కూడా వివరణ దాఖలు చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, అదానీ గ్రూపునకు చెందిన 11 లిస్టెడ్ కంపెనీలతో ఏ ఒక్కటీ తప్పు చేయలేదని సంస్థ సీఎఫ్ఓ జుగేషిందర్ రాబీ సింగ్ అన్నారు. ఏ ఒక్క కంపెనీపైనా అమెరికాలో కేసు ఉండబోదని స్పష్టం చేశారు.