భారత్‌లో రెండో కరోనా కేసు నమోదు

భారత్‌లో రెండో కరోనా కేసు నమోదు

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ కేసు భారత్‌లో రెండవది నమోదైంది. జనవరి 24న చైనా నుండి ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇది కేరళతో పాటు, భారత్‌లో కూడా నమోదైన రెండవ కేసు. మొదటిది కూడా కేరళలోనే నమోదైంది. మూడు రోజుల కిందట వుహాన్ నుంచి కేరళ వచ్చిన మెడిసిన్ విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. అది మొదటి కేసుగా నమోదైంది.  జ్వరం, దగ్గు లేదా శ్వాస ఇబ్బంది సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక ఆస్పత్రిలో రిపోర్టు చేయవలసిందిగా కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా.. జనవరి 1 తర్వాత చైనా నుంచి వచ్చిన వారు ఆరోగ్య శాఖ వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరింది.

ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల చైనాలో 300 మందికి పైగా మరణించారు.

For More News..

భార్య తల నరికి చేతిలో పట్టుకొని జాతీయగీతం

ఢిల్లీ చేరిన రెండో కరోనా ఫ్లైట్