- ఈ నెల 11 వరకు కొనసాగింపు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తన రెండో క్రెడాయాబిలిటీ షో ను శుక్రవారం ప్రారంభించింది.
కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న ఈ షో 11వ తేదీ వరకు కొనసాగుతుంది. బాలానగర్, కొంపల్లి, శామీర్‌పేట్, మేడ్చల్, అల్వాల్, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్ ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.