ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొనసాగుతున్న విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొనసాగుతున్న విచారణ

లిక్కర్ స్కాం కేసు విచారణలో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ రెండో రోజు విచారణ కొనసాగనుంది. లిక్కర్ పాలసీకి సంబంధించి హైదరాబాద్, ఢిల్లీ మీటింగ్లో పాల్గొన్న వారి వివరాలను సీబీఐ సేకరిస్తోంది. స్కాంతో సంబంధమున్న పొలిటికల్ లీడర్లు, లిక్కర్ కంపెనీల యజమానుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు స్టేట్మెంట్ కీలకంగా మరింది. దాని ఆధారంగా సీబీఐ అధికారులు రాష్ట్రానికి చెందిన మరో నలుగురిని విచారించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో కొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ వద్ద లభ్యమైన రూ.3.85కోట్లకు సంబంధించిన లెక్కలపై సీబీఐ ఆరా తీస్తోంది. అభిషేక్ రావు, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.