రెండోరోజు స్కంద కలెక్షన్స్ డ్రాప్.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా?

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati srinu) రామ్ పోతినేని(Ram pothineni) కాంబోలో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్కంద(Skanda). అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ మొదటిరోజు పరవాలేదు అనిపించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కంద మొదటిరోజు  రూ.8.52 కోట్ల షేర్.. వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 

కానీ రెండో రోజు మాత్రం ఈ కలెక్షన్స్ సగానికి పైగా పడిపోయాయి. స్కంద మూవీ రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో  రూ.3.50 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. దీంతో రెండు రోజులకు గాను ఏపీ/తెలంగాణా కలిపి రూ.12.12 కోట్ల షేర్, రూ.19.40 కోట్ల గ్రాస్.. వరల్డ్ వైడ్ గా రూ.14.57 కోట్ల షేర్, రూ.24.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. 

ఇక స్కంద మూవీ వరల్డ్ వైడ్ గా రూ.46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. రూ. 47 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.20 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ చూస్తుంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాదించడం కష్టంగానే కనిపిస్తోంది. కానీ వచ్చే రెండు రోజులు సెలవు దినాలు కావడం స్కంద సినిమాకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ రెండు రోజుల్లో స్కంద ఎలాంటి మిరాకిల్ చేయనుందో.