నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండవ రోజు చేప మందు పంపిణీ కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. చేప మందుకోసం1,60,000 చేప పిల్లలలను సిద్ధం చేశారు బత్తిని సోదరులు. చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లలో వేలమంది భక్తులు వేచి ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రల నుంచి చేప ప్రసాదం కోసం భక్తులు పోటెత్తారు. ప్రసాదం కోసం 30 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. వృద్దులు, మహిళలకు సపరేట్ క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకున్న వారికే చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల భారీ భద్రతను కల్పించారు. కాగా మొదటిరోజు 65 వేల మందికి చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
గుండెపోటుతో నిజామాబాద్ వ్యక్తి మృతి
చేప ప్రసాదం కోసం నిజామాబాద్ నుంచి వచ్చిన గొల్ల రాజు (60) అనే వ్యక్తి క్యూలైన్లో నిల్చుని గుండెపోటుతో చనిపోయాడు. ఉదయం ఆయన లైన్ లో నిలబడి ఉండగా.. గుండెపోటుకు గురై కుప్పకూలాడు. బాధితుడిని వెంటనే నాంపల్లిలోని కేర్ హాస్పిటల్ కి తరలించగా అప్పటిగే ప్రాణాలు కోల్పోయాడు. చేప ప్రసాదం కోసం శుక్రవారం రాత్రి ఆయన ఇక్కడకు చేరుకున్నాడు.