యానిమేషన్, విఎఫ్‌ఎక్స్, గేమింగ్ రంగాలకు సంబంధించిన టెక్నాలజీ, టెక్నీషియన్స్‌ను ఒక చోటికి చేర్చే సినిమాటికా ఎక్స్‌పో సెకండ్ ఎడిషన్ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాంగోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ హాజరై ఎక్స్‌పో నిర్వాహకులను అభినందించారు. రెండు రోజులు జరగనున్న ఈ కార్యక్రమానికి దాదాపు 30వేల మంది హాజరవ్వడానికి ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్పారు.
తెలంగాణ ఐటి శాఖ సహకారంతో.. సినిమా, టెక్నాలజీ, క్రియేటివిటీ వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్‌ను, ఫిలింమేకర్స్‌ను ఒకే చోట కలుసుకోవడానికి ఈ ఎక్స్‌పో వేదిక కానుంది. తెలుగు క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను మరింత ప్రోత్సహించడానికి 'క్రియేటర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ 2024' ని కూడా ఇదే వేదిక నుంచి ప్రదానం చేయనున్నారు.