అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అమెరికాలోని టెక్సాస్, కాన్సాస్ వంటి పలు రాష్ట్రాల్లోని డైరీ ఫామ్ లోని ఆవుల్లో, వాటి పాలల్లో..అలాగే పౌల్ట్రీలోని కోళ్లల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. కోళ్లల్లో బర్డ్ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్ ప్లాంట్‌లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడమే గాకుండా చికెన్ ను కూడా బంద్ చేశారు. అంతేగాకుండా మార్కెట్ నుంచి గుడ్లను వెనక్కి తీసుకోబోమని కంపెనీ ప్రకటించింది.
మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని వెటర్నరీ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ అయోనియా కౌంటీలోని వాణిజ్య పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూని గుర్తించారు . టెక్సాస్‌లోని రిడ్జ్ ల్యాండ్‌లో సుమారు 1.6 మిలియన్ల కోళ్లు చనిపోయాయి. ఆవులతో సంబంధం ఉన్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని.. అయితే ప్రజలకు వచ్చే ప్రమాదం తక్కువగానే ఉందని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.
బద్ధకం, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు ఆవుల్లో కనపడటంతో వైరస్ బారిన పడిన సంగతి గుర్తిస్తున్నామని దీంతో పాల ఉత్పత్తిని తగ్గించామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న గుడ్లతో బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం లేదని తెలిపారు డాక్టర్లు.
బర్డ్ ఫ్లూ అంటే
బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. ఇది పక్షులకు మాత్రమే కాకుండా మానవులకు.. ఇతర జంతువులకు కూడా సోకే వైరల్ ఇన్ఫెక్షన్. వైరస్ చాలా రూపాలు పక్షులకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. H5N1 అనేది బర్డ్ ఫ్లూ అత్యంత సాధారణ రూపం. మనుషుల్లో బర్ద్ ఫ్లూ కేసు 2021 డిసెంబర్ లో బ్రిటన్ లోనూ మొదటిసారిగా వెలుగు చూసింది.