- ఉమ్మడి జిల్లాలో 47, 684 మందికి రైతులకు రుణమాఫీ
- సమస్యల పరిష్కారానికి సర్వీస్ సెంటర్
- రైతులకు అందుబాటులో రెండు ఫోన్లు
- కలెక్టరేట్ లలో చెక్ లు పంపిణీ చేసిన కలెక్టర్లు
నిజామాబాద్, వెలుగు: రెండో విడత రైతు రుణమాఫీ కింద ఉమ్మడి జిల్లాలో 47, 684 మందికి రూ. 421 కోట్ల నిధులు జమయ్యాయి. నిజామాబాద్ లో రూ. 210 కోట్లు, కామారెడ్డి లో రూ. 211 కోట్లు నగదును రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. రెండో విడత రుణమాఫీ ప్రోగ్రాంను మంగళవారం ఆయా కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇందులో పాల్గొన్నారు.
రుణమాఫీ చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్లు
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తన ఆఫీస్ ఆవరణలో రుణ మాఫీ చెక్కును రైతులు చింతపల్లి రాధాకృష్ణ, పార్వతీ నవత లక్ష్మణ్‌కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెకెండ్ ఫేజ్మాఫీ సొమ్ము రెండు రోజుల్లో రైతుల ఖాతాకు జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఏవైనా సమస్యలెదురైతే కలెక్టరేట్లోని సర్వీస్ సెంటర్ సంప్రదించాలన్నారు. రాలేని వారు ఫోన్ నంబర్ 72888-94557, 7288894554 ను కాంటాక్ట్ చేయొచ్చన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో సమస్యలు రావడంతో 517 మంది రైతులకు సర్వీస్ అందించామన్నారు.
మొదటి విడతలో 44,469 మంది రైతులు రూ.225 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. రెండో విడత ద్వారా 22,868 మంది అన్నదాతలు రూ.210 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అగ్రికల్చర్ఆఫీసర్లు వారికి సహకారం అందించాలన్నారు. స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్, డీసీవో శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చవాన్, పాపయ్య తదితరులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో 24,816 మందికి మాఫీ
కామారెడ్డి జిల్లాలో రెండో విడత,816 మంది రైతులకు రూ. 211 కోట్లు మాఫీ అయినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రెండో విడత రుణమాఫీ ప్రోగ్రాంను మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో రుణమాఫీ అయిన కొందరు రైతులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చెక్‌లు అందించారు.
కామారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ.. రుణ మాఫీ విషయంలో రైతులకు సమస్యలు ఉంటే 72888 94616, 72888 94600 కు సంప్రదించాలన్నారు. అర్హులైన రుణమాఫీ ద్వారా ప్రయోజనం కలిగేలా బ్యాంకర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు తోడ్పాటు అందించాలని సూచించారు. రుణమాఫీ అంశంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయిలో ఆఫీసర్లపై ఉందన్నారు. కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ, లీడ్‌బ్యాంక్ మేనేజర్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.