చైనాలో చిక్కకున్న భారతీయులను తీసుకురావడానికి చైనా వెళ్లిన రెండో విమానం 323 మంది ప్రయాణికులతో తిరిగి ఢిల్లీ చేరింది. కరోనా దెబ్బకు చైనా నుంచి మనవాళ్లు ఇండియా బాటపట్టారు. చైనాలోని వుహాన్ పట్టణం నుంచి మొదటివిడుతలో శనివారం 324 మందిని ఎయిర్ ఇండియా విమానం తీసుకొచ్చింది. దాని తర్వాత మళ్లీ మనవాళ్లను తీసుకురావడానికి చైనా వెళ్లిన రెండో విమానం కూడా ఆదివారం ఉదయం ఢిల్లీ చేరింది. ఆ విమానంలో ఏడుగురు మాల్దీవుల పౌరులు కూడా ఉన్నారు. మొత్తంగా ఈ విమానంలో 323 మంది ప్రయాణికులు ఢిల్లీకి చేరారు. ‘వూహాన్ నుంచి ఆదివారం తెల్లవారుజామున 3:10 నిమిషాలకు బయలుదేరిన విమానం ఢిల్లీలో ఉదయం 9:45 నిమిషాలకు ల్యాండ్ అయిందని’ ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. విమానంలో వచ్చిన వారందరికీ డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది.
తమ దేశానికి చెందిన ఏడుగురిని ఇండియా తీసుకొచ్చినందుకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా షాహి… భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత చైనా రాయబారులు విక్రమ్ మిస్రీ, సుంజయ్ సుధీర్ మరియు వారి బృందాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
For More News..