రవితేజ .. మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి .. సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్

రవితేజ .. మిస్టర్ బచ్చన్  సినిమా నుంచి .. సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌‌‌‌‌. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పటికే ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేశారు. తాజాగా ‘రెప్పల్ డప్పుల్’ అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ సాంగ్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ  పాడారు. ‘బొమ్మ సోకులో..  బొంబాయి జాతరే.. బచ్చన్ గొంతులోన బప్పీ లహరే.. ఉస్కో అని అంటేనే చాలు.. డిస్కోలా మోతరే.. తెల్లార్లు చల్లారని గాన కచ్చేరే..’ అంటూ కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాశాడు.

తెలుగు, తమిళ, హిందీ..  వలపు జుగల్ బందీ.. తకిట తకిట చమట బొట్టు తాళమేస్తదే’ అంటూ సాగిన ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  పనోరమా స్టూడియోస్,  టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.