Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌.   జ్యోతి కృష్ణ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ఈ  మూవీ షూటింగ్ శరవేగంగా  జరుగుతోంది.  ఇప్పటికే ఓ పాటను విడుదల చేసిన మేకర్స్.. సోమవారం సెకండ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఆస్కార్ విన్నర్స్ కీరవాణి, చంద్రబోస్..  సంగీతం, సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల కలిసి పాడారు. ‘కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె చెనుకులతో కొలిమిలాంటి మగటిమితో.. సర సర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు.. ఏదో ఏదో తలచినాడు ఎవరినో వెతికినాడు ఎవరంటా ఎవరంటా..’ అంటూ సాగిన పాటలో   పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ లుక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

యోధుడిగా పవన్ కనిపిస్తుంటే, రాణి గెటప్‌‌‌‌లో ట్రెడిషినల్‌‌‌‌గా నిధి అగర్వాల్ ఇంప్రెస్ చేసింది.  ఇందులో  బాబీ డియోల్  కీలక పాత్ర పోషిస్తుండగా,  అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో  ఎ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.