సుధీర్ బాబు .. మా నాన్న సూపర్ హీరో .. మూవీ నుంచి 2nd లిరికాల్ సాంగ్ రిలీజ్

సుధీర్ బాబు .. మా నాన్న సూపర్ హీరో .. మూవీ నుంచి 2nd లిరికాల్ సాంగ్ రిలీజ్

సుధీర్ బాబు హీరోగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌‌‌‌తో అభిలాష్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’.   ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ రాగా,  శనివారం మరో పాటను రిలీజ్ చేశారు. ‘వేడుకలో ఉన్నది కాలం.. వేదిక ఈ కళ్యాణం.. ఏడడుగుల మొదటి ప్రయాణం జతగా ప్రారంభం.. ’ అంటూ సాగిన వెడ్డింగ్ సాంగ్‌‌‌‌లో సుధీర్ బాబు ట్రెడిషినల్ లుక్‌‌‌‌లో ఆకట్టుకున్నాడు.

  ‘పందిరిలో సంతోషాల సంత.. సందడిగా ఉందే ఊరంతా.. చిందులలో మాయం చీకు చింతా.. అదేనా సాగే కేరింత’ అంటూ పెళ్లి వేడుకను చూపిస్తూ సాగిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది.  జై క్రిష్ కంపోజ్ చేసిన ఈ పాటకు సనాపతి భరద్వాజ్ పాత్రుడు క్యాచీ  లిరిక్స్ అందించగా, ఐశ్వర్య దరూరి, బృందా, చైతు సత్సంగి, అఖిల్ చంద్ర కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేస్తుంది. ఆర్ణ హీరోయిన్‌‌‌‌గా నటించగా, సాయాజీ షిండే,   సాయి చంద్,  రాజు సుందరం,  శశాంక్, ఆమని  ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.