వరంగల్ లో రెండో ఒమిక్రాన్ కేసు

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వరంగల్ బ్యాంక్ కాలనీకి చెందిన 24ఏళ్ల యువకుడు ఈ నెల 12న స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చాడు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అతని శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ గా నిర్థారణ అయింది. దీంతో బాధితున్ని హైదరాబాద్ లోని టిమ్స్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతని కుటుంబసభ్యులతో పాటు దాదాపు 20 మందికి కరోనా టెస్టులు నిర్వహించి ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు. ఈ నెల 17న వరంగల్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. 

మరిన్ని వార్తల కోసం..

TRS ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోరు

నిరుద్యోగులను TRSఎన్నికల కోసమే ఉపయోగించుకుంది