ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2

ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ రెండో దశ త్వరలోనే మొదలుకానుంది. ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం వేదికగా రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఏప్రిల్ 14న మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు.

కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రం నలుమూలలా ప్రజలకు చేరవేసేందుకు ఆయన గతేడాది ఆగష్టు 28, 2021న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి.. అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో బహిరంగసభను నిర్వహించి ముగించారు. పాదయాత్రలో బండి సంజయ్ మొత్తం 438 కిలోమీటర్లు నడిచారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు... 8 జిల్లాలను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ కవర్ చేస్తూ.. మొత్తం 34 సభలు నిర్వహించారు.