పోలింగ్ డ్యూటీ పక్కాగా చేయాలి : జి .రవి నాయక్

పోలింగ్  డ్యూటీ పక్కాగా చేయాలి :  జి .రవి నాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పోలింగ్  డ్యూటీ పక్కాగా చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్  జి .రవి నాయక్  కోరారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో పోలింగ్  డ్యూటీ నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాయ్స్  కాలేజీలో దేవరకద్ర నియోజకవర్గం సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్​ పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ పోలింగ్  విధులు సక్రమంగా నిర్వహించేందుకు సిబ్బందికి రెండు విడతల్లో ట్రైనింగ్​ ఇస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి తప్పులు లేకుండా పోలింగ్  డ్యూటీ నిర్వహించాలని కోరారు. శిక్షణ అనంతరం పోస్టల్  బ్యాలెట్  అందిస్తామని, ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్  వేయాలని సూచించారు. దేవరకద్ర ఆర్వో నటరాజ్, పోస్టల్  బ్యాలెట్  నోడల్  ఆఫీసర్​ రవీంద్రనాథ్  పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో గర్ల్స్  కాలేజీలో రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్ మిశ్రా, ఇళక్కియా, కరుణాకరన్  పరిశీలించారు. 

నారాయణపేట: ఎలాంటి తప్పులు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ అవసరమని ఎన్నికల  పరిశీలకుడు బీపీ చౌహాన్  పేర్కొన్నారు. పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్​ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. అడిషనల్​ కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్, నారాయణపేట ఆర్వో రాంచందర్, గోపాల్ నాయక్, నర్సింగరావు పాల్గొన్నారు.


పోలింగ్  కేంద్రాల్లో సౌలతులు కల్పించాలి

నాగర్ కర్నూల్ టౌన్: పోలింగ్​ కేంద్రాల్లో సౌలతులు కల్పించాలని కలెక్టర్​ ఉదయ్​కుమార్​ సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. పోలింగ్  సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. నాగర్ కర్నూల్  రిటర్నింగ్  ఆఫీసర్​ వెంకట్ రెడ్డి, అసిస్టెంట్​ రిటర్నింగ్  ఆఫీసర్​ చంద్రశేఖర్  ఉన్నారు.

ఎన్నికలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలి

గద్వాల: అసెంబ్లీ ఎన్నికలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలని గద్వాల కలెక్టర్  వల్లూరు క్రాంతి కోరారు. పీవోలు, ఏపీఓలకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది అవేర్నెస్  పెంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్​ కంప్లీట్ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాసులు, ఎస్డీవో సుబ్రహ్మణ్యం, డీఆర్డీవో నాగేంద్రం, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ALSO READ :  మెదక్లో ఎన్నికలపై వలసల ఎఫెక్ట్​