నాగర్‌కర్నూల్, వెలుగు: దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్‌ఫేర్)లో జిల్లాలోని తెల్కపల్లి కేకే రెడ్డి హైస్కూల్తొమ్మిదో తరగతి స్టూడెంట్సాయి స్వాతిక్ రూపొందించిన బహుళర్థ సాధక వ్యవసాయ పరికరానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందని డీఈవో గోవిందరాజులు తెలిపారు.
బెంగళూరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఏపీ విద్యాశాఖ వారు గత నెల 28 నుంచి విజయవాడలో ఆరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో దక్షిణ భారత సైన్స్ ఫేర్ నిర్వహించారు. జిల్లా నుంచి విద్యార్థి సాయి సాత్విక్ నేల తేమ శాతాన్ని గుర్తించి అవసరమైన నీటి సరఫరా, చేను సంరక్షణ, జీవశాస్త్ర ఎరువుల రవాణా తదితర పనులకు సౌరశక్తి ద్వారా వినియోగించే పరికరాన్ని రూపొందించి ప్రదర్శించారు. జిల్లా సైన్స్‌అధికారి కృష్ణారెడ్డి గైడ్‌టీచర్, పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు సాయి సాత్విక్‌ను అభినందించారు.