ముగిసిన రెండో రౌండ్ లెక్కింపు.. లీడింగ్లో తీన్మార్ మల్లన్న

ముగిసిన రెండో రౌండ్ లెక్కింపు.. లీడింగ్లో తీన్మార్ మల్లన్న

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి నిలిచారు. లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సుమారు 14 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో లక్షా 44 వేల ఓట్లు లెక్కించాల్సిన ఓట్లు ఉన్నాయి. 

నాలుగు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకు 14,672 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇందులో మొదటి రౌండ్‌లో 7,670 రెండో రౌండ్‌ లెక్కింపులో 7,002 ఓట్లతో మొత్తం 14,672 ఓట్ల లీడ్ వచ్చింది.  

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు రెండో రౌండ్‌లో - 34,575 ఓట్లు లభించాయి. మొదటి రౌండ్‌లో 36,210ఓట్లు రెండో రౌండ్‌లో 34,575ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లలో కలిపి 70785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మొదటి రౌండ్ లో  28,540ఓట్లు, రెండో రౌండ్ లో 27,573 ఓట్లు మొత్తం 56,113 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి  మొదట రౌండ్ లో 11395ఓట్లు రెండో రౌండ్ లో 12841 ఓట్లు, మొత్తం 24,236 ఓట్లు వచ్చాయి. 

ఇండిపెండెంట్ అభ్యర్థి  అశోక్ కుమార్‌కు 11,018 ఓట్లు లభించాయి. అశోక్‌కుమార్‌కు మొదటి రౌండ్‌లో 9,109ఓట్లు రెండో విడతలో11,018 ఓట్లు మొత్తం 20127 మొదటి ప్రాధాన్య ఓట్లు లభించాయి. దాదాపు పదివేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

అభ్యర్థి                    పార్టీ         మొదటి రౌండ్    రెండోరౌండ్    మొత్తం
తీన్మార్ మల్లన్న    కాంగ్రెస్     36,210                   34,575        70,785
రాకేశ్ రెడ్డి               బీఆర్ఎస్ 28,540                   27,573        56,113
ప్రేమేందర్ రెడ్డి      బీజేపీ        11,395                   12,841        24,236 
అశోక్ కుమార్          ఇండి          9,109                    11,018        20,127