- రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు శుక్రవారం పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ పూర్తయినట్టు కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్ జైవన్షి సమక్షంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. 1090 ప్రిసైడింగ్ ఆఫీసర్స్,1089 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 2266 ఓపిఓ,150 మైక్రో అబ్జర్వర్స్కు ఎన్నికల విధులు కేటాయించినట్లు చెప్ఆపరు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, నగేష్ పాల్గొన్నారు.